తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి నిర్మల్ జిల్లా మండలంలోని హంగిర్గ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేదోడి సొంతింటి కలను నిజం చేసిన ప్రజా ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హంగిర్గ గ్రామంలో బొలీపెల్లి లలిత, సాయి ప్రసాద్ కుటుంబం నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరినీ అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. నూతన గృహాల్లో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూమాబాయి లక్ష్మణ్, మొగిలి సర్పంచ్ ఉష దర్శన్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ ఉత్తం భాలేరావు, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మౌలాఖాన్, మజీద్ చౌదరి, ఇక్బాల్ హైమద్, సయ్యద్ అన్వర్, ఫారూఖ్, సయ్యద్ అలా, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, తులసీరామ్, అప్ప మాజీ సర్పంచ్ పోశెట్టి, బాలాజీ, వార్డు సభ్యుడు సుధాకర్ పటేల్, ధర్మేందర్, లక్ష్మణ్, సాయి ప్రసాద్, గ్రామస్థులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






