ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా మండలం తక్కెళ్ళపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వారు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండు నరేందర్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ, కేజేఆర్ కాలనీ సర్పంచ్ సిద్దు నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అధికారులు, లబ్ధిదారు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






