మాజీ మంత్రి కేటీఆర్ మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయనకు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స అందించాలని ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని, కేటీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కలవరిస్తూ, పిచ్చెక్కి గడ్డం మీసాలు పెంచుకొని, అబద్దాలతో తెలంగాణ ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిపై కారు కూతలు కూస్తున్నారని బాణావత్ అన్నారు. సినిమా కమెడియన్ బాబు మోహన్ కి మించిన కామెడీ పంచుతున్న కేటీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.
మాజీ మంత్రికి చికిత్స అవసరం
తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రిగా సేవలందించిన కేటీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో సరైన చికిత్స అందించాలని, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సీక్రెట్ హిస్టరీ పరిశోధనాపక రాజకీయ పక్షపత్రిక పక్షాన వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రభుత్వానికి హెచ్చరిక
లేదంటే, పిచ్చి మరింత ఎక్కి రోడ్లపై పడి ఎంతమందిని గాయపరుస్తాడో, ఎన్నెన్ని అఘాయిత్యాలు చేస్తాడో అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని బాణావత్ సూచించారు. కేటీఆర్ ను జైల్లో వేసి అయినా మెంటల్ తగ్గేంతవరకు బయటకు వదలకుండా చూడాలని ప్రభుత్వానికి సూచనగా ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ తెలిపారు.












