రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ రాజకీయ మార్పు కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన కోరారు. యువతీ యువకులకు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానం పలికారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య కార్పొరేట్ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వర్గం చేత కుల, మత అల్లర్లు చేయించి, కొంతకాలం పాటు ఆపేది ఎవరో ప్రాంతీయ, సామాజిక విద్వేషాలను ప్రోత్సహించి, కొంతకాలం మాయం చేసేది ఎవరో అని ఆయన ప్రశ్నించారు.
సంపదను దోచుకుని, ఒక ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని పెంచుకుంటూ పోయి, శాంతి భద్రతల సమస్యలను ఎగదోసేది ఎవరో మన బిడ్డల చదువులకు, భవిష్యత్తుకు భద్రత లేకుండా చేసి, హక్కులను నిర్వీర్యం చేస్తున్నది ఎవరో అని నిలదీశారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకునే విధంగా కుట్రలు చేసేది ఎవరో సంపద సామాన్యులకు దక్కకుండా, పేదరికాన్ని సామాన్యులకు, సంపదను ఒక వర్గం సంపన్నులకు దారి మళ్ళిస్తున్నది ఎవరో ఈ కార్పొరేట్ రాజకీయ క్రీడలో ఆ మీడియా మాఫియా ఎవరో అని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు.
సామాన్యుల జీవితాలకు సంపద, భద్రత, బిడ్డలకు భవిష్యత్తు, సామాజిక రక్షణ కోసం ఆలోచించే పెద్దలకు, మరో స్వాతంత్ర్య పోరాట యోధులకు తమ ఆహ్వానం అని తెలిపారు. రాజకీయ మార్పే లక్ష్యంగా ఉద్యమించాలని, పేదరికం లేని సంపన్న జీవితాలను సొంతం చేసుకోవాలని, మన బిడ్డలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్ రాజకీయ బానిస పార్టీలను వదిలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భద్రత కోసం, సమ సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ కోసం, పౌర భద్రత కోసం సమాయత్తం అవుతున్న మహా కూటమిలోకి స్వచ్ఛందంగా చేరాలని కోరారు. మరో స్వాతంత్ర్య పోరాట ఉద్యమ చరిత్రలో భాగస్వాములు కావాలని, యువతీ యువకులకు ఇదే తమ ఆహ్వానం అని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.
గమనిక
మౌనం, బలహీనతలను వదిలి ఈ మహోన్నత ఉద్యమంలో భాగస్వాములు కండి. చారిత్రిక స్థానాన్ని కైవసం చేసుకోండి.
వందేమాతరం.. వందేమాతరం.. జై ఆర్పిసి.. జై జై ఆర్పిసి...
-- మేడా శ్రీనివాస్, , , (జర్నలిజం), (), రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.. మొబైల్: 9248777222.










