మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 139వ ఎపిసోడ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. 82వ బూత్ అధ్యక్షుడు దడివే దేవేందర్ పటేల్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, స్థానిక కళలు, స్వదేశీ ఉత్పత్తులు, నదీ వ్యవస్థల పునరుజ్జీవనం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై మాట్లాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు అభివృద్ధి, నైపుణ్యాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ కుమార్, సీనియర్ నాయకులు లక్ష్మీ పటేల్ కర్నే, మాజీ మండల అధ్యక్షుడు భోగ దేవేందర్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి లింగాల రాము గౌడ్, తీగల రమేష్, మాజీ ఎంపీటీసీ మురళి గౌడ్, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు సబ్బని సంపత్ కుమార్, 82వ బూత్ అధ్యక్షుడు దడివే దేవేందర్, బావల చిన్న నర్సయ్య, సాగర్ యాదవ్, రాము, శివ, ఓరగంటి గంగాధర్, కొత్తపల్లి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ శ్రేణులు
Share:

సారాంశం
రాజకీయ
ముఖ్య విషయాలు
- మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 139వ ఎపిసోడ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
- 82వ బూత్ అధ్యక్షుడు దడివే దేవేందర్ పటేల్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, స్థానిక కళలు, స్వదేశీ ఉత్పత్తులు, నదీ వ్యవస్థల పునరుజ్జీవనం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై మాట్లాడారు.
- దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు అభివృద్ధి, నైపుణ్యాల ప్రాధాన్యాన్ని వివరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4409ఆర్టికల్స్
5,30,249వ్యూస్









