సారాంశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భైంసాలో బీజేపీ, బీజేవైఎం నాయకుల ఆందోళన
ముఖ్య విషయాలు
- 1భైంసా పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బీజేపీ పట్టణ శాఖ, బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో నాయకులు మాట్లాడుతూ..
- 2ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
- 3తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలతో పాటు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
- 4తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, హిందూ దేవతలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భైంసాలో బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, హిందూ దేవతలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భైంసాలో బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భైంసా పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బీజేపీ పట్టణ శాఖ, బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలతో పాటు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.