కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని వామపక్ష, బీఆర్ఎస్, టీజేఎస్ పార్టీలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఈసీని అరెస్టు చేయాలని కోరాయి. సర్ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశాయి. తొలగించిన ఓట్లలో అర్హులైన వారి ఓట్లను తిరిగి చేర్చాలని కోరాయి. ఈ మేరకు అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎంసీపీఐ(యూ) నాయకులు అనిల్ కుమార్, ఎస్ యూసీఐ (సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, ఆర్ ఎస్ పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీఆర్కేఆర్ భవన్ వరకు ప్రదర్శన
అంతకు ముందు ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వామపక్ష, బీఆర్ఎస్, టీజేఎస్ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కేఆర్ భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఓట్ల దొంగ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే బీఆర్కేఆర్ భవన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రదర్శనగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను బీఆర్కేఆర్ భవన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు యత్నించగా తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. బారికేడ్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో పోలీసులు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి సహా పలువురిని అరెస్టు చేశారు. జాన్‌వెస్లీ, ఎమ్మెల్సీలు కోదండరాం, ఎల్ రమణ విజ్ఞప్తితో పోలీసులు బారికేడ్లను తొలగించారు. బీఆర్ కేఆర్ భవన్ వద్ద బైటాయించి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.