మండలంలోని పల్సి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిని కలిసి తమకు ఇళ్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు.
మండలంలోని పల్సి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, ఆ ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మహిళా సోదరీమణులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిలకు మహిళా సోదరీమణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని వారు మాజీ శాసనసభ్యుడిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి, మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు లోకేశ్వరం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్త గౌడ్, వార్డ్ మెంబర్ కామాజీ, పాల రాకేష్, తోట రవి, తోట దత్తు, పోతన్న, మాదన్న, సాయినాథ్, పవన్, మాజీ సర్పంచ్ శ్రావణ్, మాజీ సర్పంచ్ దత్తు గౌడ్ తో పాటు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












