న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.
సీపీపీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం వ్యవహారాలు, పార్టీ తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఎన్నికల జాబితా సవరణపై పార్టీ అనుసరించాల్సిన విధానం, భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సంఘం వ్యవహారంపై పార్టీ వైఖరిని వెల్లడించారు. ఎన్నికల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో కూడా ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.











