సమాజం కోసం, పేదల హక్కుల కోసం భూస్వాములకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని హరీశ్ రావు గారు ఆవిష్కరించారు.
విగ్రహదాతలు కన్నారెడ్డి, మల్లారెడ్డి గార్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.












