డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అవమానకరంగా మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ డిమాండ్ చేశారు. బాన్సువాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అవమానకరంగా మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ డిమాండ్ చేశారు. బాన్సువాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగం ద్వారా పదవులు పొందుతున్న ప్రజాప్రతినిధులు అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలపై స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగారం, జిల్లా అధ్యక్షుడు రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, యువసేన అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వెండి యాదవరావు, ప్రచార కార్యదర్శి రవి, బలరాం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.











