నర్సాపూర్-జి మండల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రేడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నర్సాపూర్-జి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మండల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులపై ఆదేశాలు
అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












