మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 139వ ఎపిసోడ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
82వ బూత్ అధ్యక్షుడు దడివే దేవేందర్ పటేల్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, స్థానిక కళలు, స్వదేశీ ఉత్పత్తులు, నదీ వ్యవస్థల పునరుజ్జీవనం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై మాట్లాడారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు అభివృద్ధి, నైపుణ్యాల ప్రాధాన్యాన్ని వివరించారు.







