ఆదిలాబాద్, 15 September
సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశంతో విత్తన గణపతులను పంపిణీ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 8వ బెటాలియన్‌కు అందజేశారు.
విత్తన గణపతులతో పర్యావరణ పరిరక్షణకు పిలుపు పూజ అనంతరం నేలలో నాటితే మొక్కగా మారే విత్తన గణపతులు కొండాపూర్: సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశంతో విత్తన గణపతులను పంపిణీ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 8వ బెటాలియన్‌కు అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర సమన్వయకర్త నుతికడి భోజనారాయణ ఆధ్వర్యంలో విత్తన గణపతులను పోలీసు అధికారులు, సిబ్బందికి అందించారు. కార్యక్రమంలో జిల్లా ఏసీపీ రాంబాబు, నరేంద్రరెడ్డి, డీఎస్పీలు అనిల్‌కుమార్, పూర్ణ, ఎస్సై నరసింహారెడ్డి, సీఐలు బాలకృష్ణ, నరసింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన గణపతి ప్రత్యేకతను వివరించారు. మట్టి గణపతిని పూజించిన అనంతరం నిమజ్జనం చేయడానికి బదులుగా.. విత్తన గణపతిని నేలలో నాటితే అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు. “సంప్రదాయం + పర్యావరణ పరిరక్షణ.. ఇదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందేశం. విత్తన గణపతిని పూజించి నేలలో నాటితే.. దేవుడే మొక్కగా మారి ఆశీర్వదిస్తాడు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.












