నల్లగొండ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
జిల్లా కేంద్రంలో జరగనున్న రైతుసంఘం జాతీయ మహాసభల విజయవంతం కోసం మిర్యాలగూడలో ఆదివారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా పట్టణంలో విస్తృత ప్రచారం కల్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి రైతు ప్రతినిధులు హాజరై, వారి ప్రాంతాలలో సాగువుతున్న వివిధ పంటలపై చర్చించనున్నారు.
రైతుమహాసభ విజయవంతం చేయాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ తో ప్రచారం : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) జిల్లా కేంద్రంలో వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న రైతుసంఘం జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారంమిర్యాలగూడ సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి ద్విచక్రవాహణాలపై స్టిక్కర్లను అతికించి ర్యాలీతో పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి రైతు ప్రతినిధులు హాజరై వారి ప్రాంతాలలోసాగవుతున్న వివిధ పంటలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందించేందుకు పోరాటాలకు రూప కల్పన మహాసభలో తీర్మా నించడం జరుగు తుందన్నారు.రాష్ట్రంలో ఉన్న రైస్ ఇండస్ట్రీ ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని తద్వారా ఇందులో పనిచేస్తున్న కార్మికులు దిన కూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు. మహాసభలు జయప్రదం చేయడానికి రైతులు పారిశ్రామికవేత్తలు మధ్యతరగతి ప్రజలు మద్దతు ఇస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు రాగిరెడ్డి మంగారెడ్డి, రవి నాయక్, పట్టణ సిపిఎం కార్యదర్శులు మల్లు గౌతమ్ రెడ్డి, బా వండ్ల పాండు, సిఐటియు నాయకులు తిరుపతి, రామ్మూర్తి, దేవయ్య, శ్రీనివాసరావు, వేణు, బుడుగరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.











