జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరారు.
ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్ చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌పై 21-19, 21-18 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ టోర్నీలో రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. మరో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ జెమ్కేపై 18-21, 21-16, 24-22తో ఉత్కంఠభరిత విజయం నమోదు చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని శ్రీకాంత్ గెలుపొందడం విశేషం. తదుపరి రౌండ్లో లక్ష్యసేన్ చైనాకు చెందిన డాంగ్ టియాన్ యావోతో తలపడనుండగా, శ్రీకాంత్ జపాన్ ఆటగాడు కొడాయ్ నరోకాతో పోటీపడనున్నాడు. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ముందుకు సాగగా, మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం భారత జోడీలు నిరాశపరిచాయి. ధ్రువ్ రావత్మనీషా, హరహరన్తనిషా క్రాస్టో జంటలు తమతమ తొలి రౌండ్ మ్యాచ్‌లలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

