కుబీర్, 12 September
మండలంలోని సోమేశ్వర్ తండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి సుమారు 22 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు టెండర్ కాపీని తండావాసులకు అందజేశారు.

దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, టెండర్ ప్రక్రియను ప్రారంభించినందుకు గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తండా నాయక్ ఆడే నజం, ఆలయ అధ్యక్షుడు సురేష్ రాథోడ్, ఏఎంసీ డైరెక్టర్ అరుణ్, నరేందర్, జాదవ్ తుకారాం, దన్ను, రాథోడ్ శ్యామ్, జాదవ్ రామదాస్, జాదవ్ గజానన్, రాథోడ్ నరేందర్, ఆడే రోహిదాస్, రాథోడ్ జయరాం తదితరులు పాల్గొన్నారు.