కామారెడ్డి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లాలోని ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి ఆటోలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు కామారెడ్డి: పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా, రవాణా నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో వాహనదారులు నిర్లక్ష్యం వహించరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.












