ఖానాపూర్, 7 September
మండలంలోని దిలావర్పూర్ గ్రామంలోని అతి ప్రాచీన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఘనంగా అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది. దాత వాల్గొట్ శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, సర్పంచ్ చింతల మల్లేష్, ఆలయ కమిటీ చైర్మన్ కామాజీ కిషన్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన అన్న ప్రసాద కార్యక్రమం. సెప్టెంబర్( మనోరంజని తెలుగు టైమ్స్ )2026 మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం దాత వాల్గొట్ శ్రీనివాస్ దంపతులు ఘనంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించగా సర్పంచ్ చింతల మల్లేష్ ఆలయ కమిటీ చైర్మన్ కామాజీ కిషన్ లు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. దిలావర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చుట్టూ పంట పొలాలు ఉన్నటువంటి అతి ప్రాచీన ఆలయం శ్రీ రాజరాజేశ్వర ఆలయం. ఆలయం కార్యవర్గం ప్రతి సోమవారం ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించాలని సంకల్పించారు. దాతలు లేని సమయంలో ఆలయం తరఫున నిర్వహించాలని తీర్మానించారు. శివ భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు వంట కార్యక్రమంలో పాల్గొని సకాలంలో భోజనాలు సిద్ధం చేశారు. భక్తులు అనేకమంది పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాత వాల్గొట్ శ్రీనివాస్ దంపతులను సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ ప్రధాన పూజారి మాలెపు ప్రశాంత్ శర్మ,సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కామాజీ కిషన్, సర్పంచ్ చింతల మల్లేష్, ఉప సర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్, రాస మల్ల భూమేష్, పండుగ శ్రీను, రాకేష్ కుమ్మరి రాములు, కొత్తకొండ శేఖర్, రాస మల్ల భాస్కర్, రాస మల్ల శ్రీనివాస్, నక్కల రాజన్న మరియు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.












