దెందుకూరు, కృష్ణా, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 09
తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనానికి అడ్డుగా నిలిచిన ఘటన దెందుకూరులో చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనానికి అడ్డుగా నిలిచిన ఘటన దెందుకూరులో చోటుచేసుకుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. తమకు ఇల్లు మంజూరు చేయాలంటూ తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆయన వాహనం ముందు నిలబడి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అక్కడున్న స్థానిక నాయకులు మహిళలను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పట్టుబట్టారు.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రూరల్ సీఐ మధు జోక్యం చేసుకుని మహిళలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మహిళలు తమ కుటుంబ పరిస్థితులను వివరించి, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులకు ఆదేశాలు
మహిళల విజ్ఞప్తిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో మాట్లాడారు. సదరు మహిళలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులో కాదో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించాలని, అర్హతలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కూడా అవకాశం కల్పించాలని మహిళలు కోరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


