భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, బాలల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్), కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి , జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, దేశిడి శేఖర్ రెడ్డి, మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్ అధ్యక్షులు కోడిరెక్క ఇంద్ర కుమార్, ఎండి హామీదుద్దీన్ (మోయిజ్), ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


