నిర్మల్, 13 November
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల ఆన్లైన్లో నమోదు కాని వారికి శుభవార్త. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు చొరవతో వీరికి కొత్త పింఛన్లు అందనున్నాయి. ఈ మేరకు సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల ఆన్లైన్లో నమోదు కాని వారికి శుభవార్త. ఇక తమకు పింఛన్ రాదని నిరాశ చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహరిరావు చొరవతో కొత్త పింఛన్లు అందనున్నాయి. ఈ విషయమై శుక్రవారం హైదరాబాద్లో సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ను ఆయన కలిశారు. జిల్లాలో సుమారు 200 మంది అర్హుల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కాలేదని సీఈఓకు తెలిపారు. ఈ కారణంగా అర్హులైన వారు ప్రభుత్వ పింఛన్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. వారికి మరో అవకాశం కల్పించి, దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి పింఛన్లు అందేలా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఈఓ, జిల్లాలో ఇలాంటి అర్హులందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని, అర్హులైన వారందరికీ వచ్చే నెల నుంచి పింఛన్ అందేలా చూస్తామని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ హామీ ఇచ్చినట్లు శ్రీహరిరావు తెలిపారు.






