నిర్మల్, 13 November
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా సమావేశంలో ఈ మేరకు సమీక్షించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా సమావేశంలో పాల్గొని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రహదారులపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలను తొలగించాలని, పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించేవారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని, ప్రమాదాల నివారణకు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై బాధ్యతగా వ్యవహరించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ రాజేందర్, ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






