కుబీర్, 13 November
మండలంలోని సిర్పెల్లి తండా-3లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఈరోజు భూమిపూజ నిర్వహించారు. ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ప్రత్యేక చొరవతో అర్హులైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారుడి కుటుంబంలో ఆనందం వ్యక్తమైంది.
మండలంలోని సిర్పెల్లి తండా-3లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఈరోజు భూమిపూజ నిర్వహించారు. ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ప్రత్యేక చొరవతో అర్హులైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారుడి కుటుంబంలో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి సంతోష్ రెడ్డి, సర్పంచ్ క్రాంతి రాజ్ చౌహాన్, వార్డు సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించి, ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి కల సాకారం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ చూపుతున్న చొరవ అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. తమకు అండగా నిలిచి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేసిన నారాయణరావు పటేల్‌కు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

