పరిష్కారానికి (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 13
నిజామాబాద్ జిల్లాలో ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, ప్రభుత్వ నిబంధనల అమలు వంటి అంశాలపై తెలంగాణ ఫార్మసిస్టు సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ఫార్మసిస్టు సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, ఫార్మసీ రంగంలో ఎదురవుతున్న సమస్యలు మరియు ప్రభుత్వ నిబంధనల అమలుపై చర్చించేందుకు జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను జిల్లా కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సయ్య, నిజామాబాద్ అర్బన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. శ్రీకాంత్, నిజామాబాద్ రూరల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఆర్. శ్రీలతలను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు, మెడికల్ షాపుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, డ్రగ్ ఇన్స్పెక్షన్ల సమయంలో పాటించాల్సిన విధానాలు, ప్రభుత్వ నిబంధనలపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా ప్రతి మెడికల్ షాపులో అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సేవలు అందుబాటులో ఉండటం, షెడ్యూల్ 1 రిజిస్టర్, పర్చేజ్ సేల్స్ రికార్డుల నిర్వహణ, నార్కోటిక్ మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విషయంలో చట్టపరమైన నిబంధనల పాటింపు, ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల పంపిణీ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఫార్మసిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, తనిఖీల సమయంలో నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తూ పారదర్శకమైన విధానాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మసిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి శాఖాపరమైన సమన్వయంతో కృషి చేయడమే తమ సంఘం ప్రధాన ఉద్దేశమని ప్రతినిధులు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించడం ప్రతి మెడికల్ షాపు యజమాని, ఫార్మసిస్ట్ బాధ్యత అని, ప్రజలకు సురక్షితమైన ఔషధ సేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఫార్మసిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సమన్వయంగా పనిచేస్తామని జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. 1. జిల్లా అధ్యక్షులు 2. జిల్లా ప్రధాన కార్యదర్శి 3. జిల్లా కోశాధికారి 4. నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు
తెలంగాణ ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ మన ఐక్యతే మన బలం మన వృత్తి గౌరవమే మన లక్ష్యం






