అక్బర్పేట్–భూంపల్లి, 13 November
గోపాల్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
గోపాల్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గోపాల్ మండల కేంద్రంలోని బంగారమ్మ గడ్డ కాలనీకి చెందిన నలువోతుల విష్ణు (44) శుక్రవారం ఉదయం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పద్మావతి ఫంక్షన్ హాల్లో తన భార్య కిష్టమ్మను కూలి పని నిమిత్తం వదిలి, తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా, వెనుక నుంచి వస్తున్న 32 2299 నంబర్ గల క్రేన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య కిష్టమ్మ అక్కడికి చేరుకొని బోరున విలపించారు.
పోలీసుల విచారణ
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన క్రేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికుల డిమాండ్
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఫంక్షన్ హాల్ ముందు రెడ్ సింబల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


