రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి రమాదేవి గారిని తెలంగాణ స్టేట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కమిటీ (రిజిస్టర్ నెం. 1148/2023) రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ఔట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మరియు అధ్యక్షులు పులి లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు, జిల్లా జేఏసీ ఉపాధ్యక్షులు దయ్యాల కొమరయ్య గారు, బొప్ప శేఖర్ గారు, కూలేరు సాగర్ గారు మరియు కార్యదర్శి క్యాతం నరేష్ గారు ఈవో గారితో సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఈవోతో చర్చించినట్లు సమాచారం.






