ఆదిలాబాద్, 12 November
కుబేర్ మార్కెట్ మండలంలోని మార్లగొండ గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. లబ్ధిదారులు మిలన్, ప్రేర్ మార్కెట్మ్ బాయి, అరుణబాయి తమ గృహ నిర్మాణాల కోసం భూమి పూజ చేర్ మార్కెట్సి పనులు ప్రారంభించారు.
కుబీర్ మండలంలోని మార్లగొండ గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మిలన్, ప్రేమ్ బాయి (గాలిసింగ్ తండా), అరుణబాయి (కిరునాయక్ తండా) తమ నూతన గృహ నిర్మాణాల కోసం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఇళ్ల మంజూరులో మాజీ ఎమ్మెల్యే కృషి
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవికబాయి శ్యామ్ రావు మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిని కోరగా, ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, మార్లగొండ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేశారని తెలిపారు.
గ్రామ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రోహిదాస్, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్, కిషన్ జాదవ్, రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ సంతోష్, యాదవ్ అంజేష్, రాథోడ్ శివరాం, దినేష్, రాథోడ్ శ్యామ్, గోకుల్, రాథోడ్ రామారావు, రాథోడ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



