కుబీర్, 12 November
మండల మాజీ జెడ్పీటీసీ రమేష్ మాతృమూర్తి ఎల్లంత్వార్ నర్సుబాయి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మండల మాజీ జెడ్పీటీసీ రమేష్ మాతృమూర్తి ఎల్లంత్వార్ నర్సుబాయి గత మూడు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నర్సుబాయి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో లోకేశ్వరం బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అనిల్, ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేక్, మాజీ వైస్ ఎంపిపి సాయన్న, పిరాజి, జోహార్పుర్ మాజీ సర్పంచ్ దిగంబర్, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్ మరియు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.






