లోకేశ్వరం, 12 November
మండలం కనకాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నీరడి సాగర భర్త చిన్ని కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్ని కుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, జోహార్పూర్ మాజీ సర్పంచ్ దిగంబర్, బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, ఓరగంటి బాబన్న, ఇర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.






