బోధన్, 12 November
కార్తీక మాసం సందర్భంగా బోధన్ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
బోధన్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కార్తీక మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బోధన్ డిపో, వివిధ దేవాలయాల దర్శనం కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ యాత్రల ద్వారా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభించింది.
కావున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. టికెట్ బుకింగ్ కోసం 6301415975, 9985602789, 9959226001 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని బోధన్ డిపో మేనేజర్ తెలిపారు.






