నిజామాబాద్, 12 November
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి నిర్మల్ లో తలపెట్టిన రైతు గర్జన సభకు బుధవారం బయలుదేరారు. మార్గమధ్యంలో ఆర్మూర్ చేరుకున్న కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి నిర్మల్ లో తలపెట్టిన రైతు గర్జన సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
నిర్మల్ రైతు గర్జన సభకు వెళుతుండగా మార్గమధ్యంలో గల ఆర్మూర్ పట్టణానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి, పట్టణం నుంచి పెద్ద ఎత్తున కదిలిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జీవన్ రెడ్డి పిలుపు మేరకు ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు.
కేటీఆర్ కు ఘన స్వాగతం
కాసేపటికే కేటీఆర్ వాహనశ్రేణి ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, వచ్చేది కేసీఆర్ రాజ్యమే అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. గులాబీ సైన్యం కోలాహలం మధ్య కేటీఆర్ కారు దిగి పార్టీ నేతలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. ఆర్మూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు పూలమాలలు, బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. జీవన్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు కేటీఆర్ ను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలువురు గులాబీ నేతలను, కార్యకర్తలను కేటీఆర్ కు పరిచయం చేశారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పార్టీ నేతలు ఎగబడ్డారు. అనంతరం కేటీఆర్ జీవన్ రెడ్డి తో కలిసి పార్టీ నాయకులు, శ్రేణులకు అభివాదం చేస్తూ ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద నుంచి బయలుదేరి నిర్మల్ వెళ్లారు.

