అమ్‌స్టర్‌డామ్ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 12
ఇజ్రాయిల్‌తో సైనిక, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని, ఆ దేశానికి ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌లో భారీ ప్రదర్శన జరిగింది. పాలస్తీనాకు మద్దతుగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
ఇజ్రాయిల్‌తో కొనసాగిస్తున్న సైనిక, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని, ఆ దేశానికి ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు రాజధాని వీధుల్లో ప్రదర్శనలో పాల్గొన్నారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫామ్, నోవిబ్ వంటి ప్రముఖ మానవతా సంస్థలు ఈ ప్రదర్శనకు మద్దతు తెలిపాయి. ప్రదర్శనకారులు ఎరుపు రంగు దుస్తులు ధరించి, పాలస్తీనా పతాకాలు చేత పట్టుకొని మ్యూజియం స్క్వేర్‌కు తరలి వచ్చారు. ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు.
డేటా సెంటర్‌పై దాడి
ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ బృందాలు కూడా గత శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించాయి. అమ్‌స్టర్‌డామ్ శివారులో నిర్మిస్తున్న నూతన డేటా సెంటర్ వద్దకు సుమారు వంద మందికి పైగా నిరసనకారులు చేరుకొని లోపలికి చొరబడ్డారు. కంచెలు దూకి, క్రేన్లపైకి ఎక్కి బ్యానర్లు ప్రదర్శించారు.
డేటా సెంటర్ల నిర్మాణం కారణంగా భారీగా విద్యుత్, నీటి వినియోగం జరుగుతోందని, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని వారు ఆరోపించారు. నిరసనలు తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి, వారిని అడ్డుకొని 200 మందిని అదుపులోకి తీసుకున్నారు.

