నిర్మల్, 11 November
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు కేసీఆర్ అని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా మరో సంవత్సరం ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్యాలెండర్ మారకముందే తెలంగాణలో రాజకీయ మార్పు రాబోతుందని, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాటం చేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
రైతుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, రైతులందరూ ఐక్యంగా ఉండి పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు.






