బాసరాలు, 11 November
బాసర మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నూతన అధికారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాసర మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నూతన అధికారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల పురోగతిపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మామ్మయి రమేష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి సుద్దోల్ల గంగాప్రసాద్, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సంజు రావు దేశ్ముఖ్, మాజీ ఎంపీటీసీ ఖలీల్, కాంగ్రెస్ నాయకులు సిహెచ్. నాగరాజ్, యువజన కాంగ్రెస్ మండల నాయకుడు గురప్ప శంకర్ తదితరులు పాల్గొన్నారు.

