కుబీర్, 11 November
నిర్మల్ జిల్లా మండలంలోని పార్డి బి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన కుస్తాపూర్ అంజనాబాయి, బాబు నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జు పటేల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్, సర్పంచ్ కందూరు సాయినాథ్, హల్దా సర్పంచ్ దేవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ చౌహాన్ శంకర్, డీసీసీ కార్యదర్శి సూది రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూరు సంతోష్, మాజీ సర్పంచ్ విజయ్, మంగళ్ సాయి, బెల్లల గంగాధర్, ఆల్కే దత్తాత్రీ, సాతాం రవి మిలింద్ తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


