చిన్నకోడూరు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 11
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, చిత్తశుద్ధితో పనిచేస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు అదనంగా రూ.20 చెల్లించడంతో పాటు, బస్తాలు కుట్టేందుకు సూదిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు అదనంగా రూ.20 చెల్లించడంతో పాటు, ధాన్యం బస్తాలు కుట్టేందుకు అవసరమైన సూదిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. మండల పరిధిలోని కమ్మర్లపల్లి, మైలారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు ఎల్నినో విపత్తు ప్రభావంపై అవగాహన కల్పించారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైతుల కల్లాల్లో రాజకీయాలకు తావులేదని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాజకీయాలు చేయకుండా రైతులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు నముండ్ల సరిత హరీష్, రేగుల శ్యామల దేవయ్య, ఉప సర్పంచులు కప్పెర రాజు రెడ్డి, మమత శ్రీధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాల్వ జగన్, జక్కుల నాగరాజు, రైతులు ముక్కెర శ్రీనివాస్, ఇస్కిల్ల పరశురాం, నాగపూరి హన్మయ్య, నాయకులు సందబోయిన పరశురాం, నముండ్ల సంజీవ్, వడ్లూరి అశోక్, అరవింద్, అంజనేయులు, వార్డు సభ్యుడు పసుపుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

