మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్పంచ్ పందిరి చంద్రకళ సురేందర్, ఉప సర్పంచ్ గోవర్ధన్ ప్రవీణ్ కుమార్, సొసైటీ నాయకులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో సాంకేతిక విద్యాభివృద్ధికి మౌలానా ఆజాద్ చేసిన కృషి మహోన్నతమైనదని కొనియాడారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సొసైటీ వ్యవస్థాపకులు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మహనీయుల సేవలను స్మరించుకుంటూ 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రానంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, ఉన్నత, సాంకేతిక విద్యల ఉన్నతికి ఆజాద్ ప్రణాళికాబద్ధంగా కృషి చేశారని చెప్పారు. ప్రతిభ గల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలను గుర్తించి, వారికి సముచిత ప్రాధాన్యతనిచ్చి పదవులు అందజేశారని గుర్తుచేశారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, కోశాధికారి షేక్ షాదుల్లా హుస్సేన్, మహమ్మద్ కరీముద్దీన్, మహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్, తాజీమ్ ఖాన్, మస్జిద్ కమిటీ అధ్యక్షులు షేక్ అష్ఫాఖ్, అజీజ్, ముదస్సిర్, ఫారూఖ్ బేగ్, ఆసీం, ఆర్షద్, సాయి, శ్రీకాంత్, అరుణ్, రషీద్, జాకీర్, ఆవేజ్, నజీర్, జమీల్, జమీర్, దిల్షాద్, ముబీన్ పాషా, నరేష్, దొడ్ల సొసైటీ మండల బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా
Share:

సారాంశం
ముందుకెళ్దాం లో మౌలానా ఆజాద్ జయంతి
ముఖ్య విషయాలు
- సొసైటీ వ్యవస్థాపకులు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మహనీయుల సేవలను స్మరించుకుంటూ 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
- ముందుగా సర్పంచ్ పందిరి చంద్రకళ సురేందర్, ఉప సర్పంచ్ గోవర్ధన్ ప్రవీణ్ కుమార్, సొసైటీ నాయకులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో సాంకేతిక విద్యాభివృద్ధికి మౌలానా ఆజాద్ చేసిన కృషి మహోన్నతమైనదని కొనియాడారు.
- స్వాతంత్య్రానంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, ఉన్నత, సాంకేతిక విద్యల ఉన్నతికి ఆజాద్ ప్రణాళికాబద్ధంగా కృషి చేశారని చెప్పారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4579ఆర్టికల్స్
5,45,972వ్యూస్
