మెండోరా, ముప్కల్ ఉమ్మడి మండలాల పరిధిలో భూదేవి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 17 సంవత్సరాల లోపు ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అంతర్ పాఠశాల బాల-బాలికల కో కో విభాగంలో పోచంపాడు బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ బి మైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మెండోరా ప్రతినిధి: మెండోరా, ముప్కల్ ఉమ్మడి మండలాల పరిధిలో భూదేవి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 17 సంవత్సరాల లోపు ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అంతర్ పాఠశాల బాల-బాలికల కో కో విభాగంలో పోచంపాడు బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ బి మైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అధికారుల అభినందనలు
పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించడం పట్ల ఏటిపి శ్రీమతి అశ్విని సంతోషం వ్యక్తం చేశారు. డిప్యూటీ వార్డెన్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వాలీబాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రథమ స్థానం సాధించే విధంగా శిక్షణ ఇచ్చిన పాఠశాల పిటి సిహెచ్ సంజీవ్ పట్ల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

