ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు తరలివెళ్లారు. జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమయ్యారు.
నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు నేతృత్వంలో ప్రత్యేక వాహనంలో నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి నుండి నాయకులను తరలించేందుకు ప్రత్యేక బస్సును కూడా ఏర్పాటు చేశారు. శ్రీహరి రావు జెండా ఊపి బస్సును ప్రారంభించారు.












