నిర్మల్ జిల్లా మండలం ఝరి బి గ్రామానికి చెందిన మేకల శివదాస్ కుమారుడు మేకల పృథ్వీ రాజ్ నిశ్చితార్థ వేడుకలు భైంసాలోని నర్సింహ టెంపుల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ శుభకార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మౌలాఖాన్, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

