ఇటీవల బహుజన యోధుడు పండుగ సాయన్న జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ. డి. లో ఉన్న ముదిరాజ్ కులస్థులను బీసీ. ఏ. లో చేర్చే విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, బీసీ. ఏ. హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ. ఓ. ప్రవీణ్ సార్ కు వినతి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ. ఏ. కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ జిల్లా కన్వీనర్ సుంకేట. పోశెట్టి, జిల్లా కన్వీనర్ తోకల. సరస్వతి, బైంసా డివిజన్ కన్వీనర్ హన్మాన్వారి. ప్రమీల, జిల్లా నాయకులు తోకల. పోశెట్టి, పడిగేల. దేవేందర్, యు. శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, బీసీ. ఏ. లో ఇతర కులాలను చేర్చే ముందు, ప్రస్తుతం బీసీ. ఏ. లో ఉన్నవారిని ఎస్. సి. ఎస్. టి. లో చేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతే ఇతర కులాలను బీసీ. ఏ. లో చేర్చే అంశం గురించి మాట్లాడాలని అన్నారు. లేని యెడల భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీ ఏ లో ముదిరాజ్ ల చేర్పుపై స్పష్టత కోరిన సంఘాలు
Share:

సారాంశం
ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో కలెక్టర్కు వినతి
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4425ఆర్టికల్స్
5,32,842వ్యూస్









