కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కండెల రాజన్న మనుమరాలు, కండెల సునీల్ కుమార్తె కండెల శివాని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి విద్యార్థిని కండెల శివానికి శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు బెల్లల గంగాధర్, ఏరేకర్ మిలింద్ తదితరులు పాల్గొన్నారు.












