ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాదంలో మరణించిన గుర్తు తెలియని వ్యక్తికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసుల అభ్యర్థన మేరకు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాదంలో మరణించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అంతిమ సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి, బుధవారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, సతీష్, గౌస్, రసూల్, బాలకృష్ణ పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.
చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఆదరణ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము: 82972 53484, 9182244150.

