ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా పులివెందుల పర్యటనను రద్దు చేసుకుని, బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు రానున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
బెంగుళూరు నుంచి విజయవాడకు.. వైసీపీలో ఏం జరుగుతోంది ఎందుకు అధినేత జగన్ టెన్షన్ పడుతున్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా, బెంగుళూరులో ఎందుకు మకాం వేశారు బుధవారం నుంచి మూడు రోజులు పులివెందులకు వెళ్లాల్సిన ఆయన, బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు ఎందుకు వస్తున్నారు ఏమైనా కొత్త పరిణామాలు జరగబోతున్నాయా ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఎన్నికల కంటే రాజకీయ పార్టీలకు ఏదీ ముఖ్యం కాదు. వాటి కోసం ఐదేళ్లు కళ్లు కాయలు కాసేలా చూస్తుంటాయి. అలాంటిది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఓ వైపు నామినేషన్ల తతంగం నడుస్తోంది. అయినా సరే వైసీపీ అధినేత జగన్ బెంగుళూరులో మకాం వేశారు. వారంలో ఒక రోజు విజయవాడకు రావడం, మీడియా సమావేశం పెట్టడం, గవర్నర్ను వెళ్లి కలవడం చేస్తున్నారు. జగన్ మకాం వెనుక ఏదో జరుగుతోందని చాలామంది నేతలు అంటున్నారు.
బుధవారం నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీల నామినేషన్ల ఘట్టం మొదలుకానుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు పులివెందులలో మకాం వేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ పులివెందుల టూర్ రద్దు అయినట్టు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు జగన్ రానున్నట్లు సమాచారం.
ఉన్నట్లుండి జగన్ టూర్ రద్దు వెనుక ఏం జరుగుతోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం తాడేపల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పులివెందుల టూర్ రద్దు చేసుకుని, అత్యవసరంగా విజయవాడకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.







