విజయదశమి, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ దాదాన్న గారి విఠల్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రైతులు పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నారు.
ప్రొద్దుటూరు, అల్లోల టవర్స్, నీలకంఠేశ్వర టవర్స్ ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్‌కు అమ్మవారి ఆశీస్సులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని విఠల్ రావు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, రామరాజ్యం తరహాలో సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
విజయదశమి అంటేనే అధర్మం, అన్యాయం, అణిచివేతలపై ధర్మం, న్యాయం సాధించే విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. కౌరవులు అధర్మానికి ప్రతీకగా, పాండవులు ధర్మానికి ప్రతీకగా జరిగిన యుద్ధంలో చివరకు ధర్మమే గెలిచిందని గుర్తుచేశారు.
జంబి చెట్టు ప్రత్యేకత
అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్లే సమయంలో పాండవులు తమ ఆయుధాలను జంబి చెట్టు వద్ద భద్రపరిచిన సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, విజయదశమి రోజున జంబి చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జంబి ఆకులను బంగారంగా భావించి, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా పరస్పరం పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకోవడం దసరా పర్వదిన ప్రత్యేకతగా పేర్కొన్నారు.
తెలంగాణ పండుగగా దసరా
తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని విఠల్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా దసరాను ప్రకటించడంతో పాటు, జంబి చెట్టు, పాలపిట్టకు రాష్ట్ర గుర్తింపులో ప్రత్యేక స్థానం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
అన్ని కులాలు, మతాలను గౌరవించే సెక్యులర్ పాలనకు ప్రాధాన్యమిచ్చిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారని అన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ విందు, హిందువులకు దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
ధర్మం, న్యాయం, సమానత్వం, సుస్థిర పాలన విలసిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో విజయదశమి కొత్త వెలుగులు నింపాలని దాదాన్న గారి విఠల్ రావు ఆకాంక్షించారు.


