దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, తొమ్మిదో రోజు సోమవారం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు సిద్ధిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, తొమ్మిదో రోజు సోమవారం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు సిద్ధిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. సిద్ధిదా అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.


