నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన నవదుర్గా సన్నిధిలో సోమవారం మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గామాత పూజారులతో పాటు గ్రామానికి చెందిన పలువురు దంపతులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుర్గామాతను మహిషాసురమర్దిని అవతారంలో అలంకరించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మహాయజ్ఞంలో డాక్టర్ సాగర్, మురళి, గౌడ్ రమేష్, గణేష్ గౌడ్, చంద్రకాంత్ దంపతులు, మహేందర్, రాజు, శంకర్, నవీన్, నరేందర్, ముత్యం, భరత్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

