ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అమరవేణి సిద్ధార్థ బహుజన్ గౌడ్ గారి నెల మాసికాన్ని పురస్కరించుకుని, జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సిద్ధార్థ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, ఆదివాసి ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గంట సత్యం, టి ఏ కె ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బంటు శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు పెద్ది రాజన్న, ఇంజనీర్ పోచన్న, తోటరాజు, లింగు, నర్సయ్య, రాజేశ్వర్ తో పాటు వివిధ ప్రజా సంఘాలు, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ మావోయిస్టు నాయకులు చంద్రన్న, ఇతర నాయకులు సిద్ధార్థ బహుజన్ గౌడ్ తల్లిదండ్రులైన అమరవేణి నర్సాగౌడ్, నిర్మలలను, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.