ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు పౌరులకు ఒక శక్తివంతమైన ఆయుధమని న్యాయవాది మొహమ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు, ప్రజా అధికారుల జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో సమాచార హక్కు చట్టం () కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
భారతదేశంలో సమాచార హక్కు చట్టం, 2005 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందని, అందుకే ప్రతి సంవత్సరం ఈ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన వివరించారు.
ప్రశ్నించే పౌరుడే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. సమాచార హక్కును సద్వినియోగం చేసుకుని పారదర్శక పాలన, జవాబుదారీతనం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.












